జన్మదినం సందర్భంగా పేదలకు బియ్యం పంపిణీ చేసిన మహేష్ అభిమాని అంజి

తన జన్మదిన సందర్భంగా ఆఖిల భారత మహేష్ అభిమాన సంఘం నాయకులు అంజిరెడ్డి పేదలకు బియ్యం పంపిణీ చేశారు.

వివరాల్లోకి వెళితే శనివారంనాడు తన జన్మదిన సందర్భంగా ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలను గుర్తించి…. తమ అభిమాన కథానాయకుడు మహేష్ బాబు స్పూర్తితో పది మందికి బియ్యం పంపిణీ చేసి ఎలాంటి ప్రచారం లేకుండా నిరాబండంగా జన్మదినాన్ని జరుపుకున్నారు.

యువతకు స్ఫూర్తినిచ్చే ఈ విషయం తెలుసుకున్న పొదిలి టైమ్స్ సమాచారం అడగగా ఆడంబరాలకు పోవడం ఇష్టంలేక ఇలా స్వతహాగా పంపిణీ చేయడం జరిగిందని….. మనం జరుపుకునే ఇటువంటి వేడుకలు పేదల ఆకలి తీర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందని అంజిరెడ్డి తెలిపారు.