సరిహద్దుల్లో వెనక్కి తగ్గిన చైనా
వివాదాస్పద భూమి నుండి వైదొలిగినట్లు చైనా ప్రకటన
ధృవీకరించిన భారత్
నిన్న చైనా విదేశాంగ మంత్రితో అజిత్ దవల్ చర్చలతోనే వెనక్కి తగ్గిన చైనా
భారత- టిబెట్ సరిహద్దుల్లో భారత్ చైనాల మద్య ఉద్రిక్తత కారణమైన వివాదాస్పద భూమి గాల్వన్ లోయ, ఫాంగైన్ సరస్సు, నుండి చైనా వైదొలగుతున్నట్లు సోమవారం నాడు ప్రకటించగా భారత్ ఈ విషయాన్నిధృవీకరించింది.
గాల్వన్ లోయ వివాదాస్పద భూమిలో పింగర్ 4అడుగు పెట్టడంతో గత నెల 15వ తేదిన భారత్ – చైనా సైన్యం మద్య జరిగిన ఘర్షణలో భారత సైనికులు 23మంది మృతి చెందగా….. భారత్ ప్రతికార దాడిలో సుమారు 150మందికి పైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా ప్రచరించిన విషయం విధితమే…… నాటి నుండి సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది అయితే శుక్రవారంనాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్ లోని సైనిక స్థావరాలను సందర్శించడం గాయపడిన సైనికులను పరామర్శించి సైన్యానికి మనోదైర్యం కల్పించటం ద్వారా చైనాకు గట్టి హెచ్చరికలు పంపించడం…… నిన్న ఆదివారం భారత సర్వసైన్యాధ్యక్షుడు భారత రాష్ట్రపతి రామ్ నాద్ కొవింద్ ను కలవడంతో భారత్ సైనిక చర్యకు సిద్ధంగా ఉందని హెచ్చరికలు పంపడంతో
చైనా ఒక్కసారిగా ఇరకాటంలో పడటంతో రంగంలో దిగిన భారత జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దావల్ చైనా విదేశాంగ మంత్రితో సుమారు రెండు గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన చర్చలతో చైనా వెనక అడుగు వేసి వివాదాస్పద పింగర్ 4నుండి 2కిలోమీటర్ల వెనక్కి వెళ్ళినట్లు భారత్ ప్రకటించిన కొద్ది సేపటి తరువాత చైనా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
చైనా వెనక్కి తగ్గేల చేయడంలో భారత్ దౌత్యం, అజిత్ దవల్ చర్చలు పనిచేశాయని అధికార వర్గాలు తెలిపాయి.