ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి పురస్కరించుకుని యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్డు వద్ద విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించి అనంతరం కేకును కట్ చేశారు.
అక్కడి నుండి కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి విశ్వనాథపురం, పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్, బుచ్చినపాలెం, నందు వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రపుశాల కోటేశ్వరి, జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి,సాయిరాజేశ్వరరావు ,గుజ్జుల సంజీవరెడ్డి, కంభాలపాడు మాజీ సర్పంచ్ పుల్లగొర్ల శ్రీనివాస్ యాదవ్, హనీమున్ శ్రీనివాసులురెడ్డి, యర్రం వెంకటరెడ్డి, శేషగిరి, మహిళ నాయకురాళ్లు షేక్ నూర్జహన్ , దోర్నాల వరమ్మ, కసిరెడ్డి భాగ్యలక్ష్మి, మరియు కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.