మొక్కలు నాటిన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి

పట్టణంలోని స్థానిక హరికృష్ణ థియేటర్ రోడ్డునందు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి మొక్కలు నాటారు.

వివరాల్లోకి వెళితే ప్రముఖ నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హరికృష్ణ థియేటర్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ చక్రవర్తి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నాగరాజు, పండు అనిల్, యక్కలి శేషగిరిరావు, మస్తాన్ రావు, మల్లి, మోహనరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.