తహశీల్దార్ ప్రభాకరరావుకు పలువురు అభినందనలు
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారుగా ఒక సంవత్సరం పదవికాలం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మండలంలో పలు సంస్థలు ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సత్కరించారు.
అందులో భాగంగా ఆదివారంనాడు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో జనసేనపార్టీ నాయకులు మరియు దేవదాయశాఖ సిబ్బంది తదితరులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హల్చల్ జహీర్, నాగార్జున యాదవ్, షేక్ షఫీ, నారాయణ మరియు దేవదాయశాఖ ఉద్యోగి కాటూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.