పట్టణంలో నిత్యావసర మరియు అన్ని ప్రైవేటు కార్యకలాపాలు నిలిపివేస్తూ ఆదేశాలు

పట్టణంలో నిత్యావసర, వ్యాపార మరియు ప్రైవేటు కార్యకలాపాలు నిలిపివేస్తూ గురువారంనాడు రాత్రి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పట్టణంలో కోవిడ్ కేసుల వ్యాప్తి దృష్ట్యా సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న అధికారులు…. గురువారం రాత్రి నుండే ఆదేశాలను అమలు చేస్తున్నారు.


పట్టణంలో అత్యవసర సేవలు మినహా అన్ని వ్యాపార, వాణిజ్య మరియు ప్రైవేటు సంస్థల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు.

అధికారుల నుండి మనకి అందుతున్న సమాచారం మేరకు కొందరు వ్యాపారులు తమకు కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ బయటికి చెప్పకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇతరురులకు వ్యాప్తి చెందేందుకు కారణం అయినట్లు గుర్తించినట్లు సమాచారం .

అయితే నిత్యావసర మరియు వ్యాపార సంస్థలు తెరచుకునేందుకు కొంత వెసులుబాటు కల్పిస్తూ వ్యాపారస్తులు ఎవరైతే కోవిడ్ పరీక్ష నిర్వహించుకుని పరీక్షలో నెగిటివ్ గా తేలిందో వారికి మాత్రం ఉదయం 6నుండి 9వరకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఏదేమైనప్పటికి ప్రజల ప్రాణం కంటే ఏమి ఎక్కువకాదు అనే లక్ష్యంతోనే సంపూర్ణ లాక్ డౌన్ విధించడం జరిగిందని అధికారులు చెప్తున్నారు.