పొదిలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి : యాదవ మహాసభ డిమాండ్

పొదిలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత యాదవ మహాసభ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు భవనము నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నూతన జిల్లాల ప్రక్రియలో జిల్లా కేంద్రానికి మరియు పలు జిల్లాల ప్రయాణానికి కూడలిగా ఉన్న పొదిలిని విస్మరించడం అన్యాయమని….. పొదిలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమానికి సైతం సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబూరావు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పెమ్మని రాజు, పులగొర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.