హమాలీలకు కూలి రేట్లు పెంచి బకాయిలు వెంటనే చెల్లించాలి : సిఐటీయూ ప్రధాన కార్యదర్శి రమేష్
2020 జనవరి నుండి పెంచాల్సిన కూలి రేట్లు పెంచి బకాయిలతో సహా వేంటనే చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త సివిల్ సప్లై హమాలీల పిలుపు మేరకు పొదిలిలోని సివిల్ సప్లై స్టాక్ పాయింట్ వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో హమాలీలు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియూ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ హమాలీల కూలిరేట్ల ఒప్పందం 2019 డిసెంబర్ నాటికి ముగిసినప్పటికీ నేటికి కూడా కూలిరేట్లను పెంచకపోవడం బాధాకరమని….. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో కూడా రేషన్ సకాలంలో పేదలకు అందేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్రామాలకు తరలిస్తున్న హమాలీలకు 50లక్షల రూపాయల కోవిడ్ ప్రమాద భీమా వర్తింపజేయకపోవడం అలాగే ఈఎస్ఐ స్కీములో వీరిని చేర్చకపోవడం అన్యాయమని అన్నారు.