కోవిడ్ వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
కరోనా వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సిపియం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే వామపక్షాలు పిలుపు మేరకు సోమవారంనాడు స్ధానిక విశ్వనాథపురంలోని సిపిఎం కార్యలయంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పొదిలి సిపిఎం ప్రాంతీయ కమిటి కార్యదర్శి యం రమేష్ మాట్లాడుతూ కరోనా రోగులకు వైద్య సదుపాయాలు మెరుగుపరచి తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.