ఒంగోలు కోవిడ్ వైద్యశాలలో పొదిలికి చెందిన మహిళ మృతి చెందిన సంఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని పాతూరుకు చెందిన మహిళకు గతవారం కోవిడ్ పరీక్షలలో పాజిటివ్ నిర్ధారణ అవగా ఒంగోలు కోవిడ్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారంనాడు మరోసారి కోవిడ్ తుది పరీక్షల నిమిత్తం నమూనా సేకరించిన వైద్యులు ఫలితాల కోసం ఎదురు చూస్తుండగా నమూనాలు సేకరించిన సోమవారంనాడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
సంబంధించిన పూర్తి సమాచారం తెలియలసిఉంది