భారత్ కు చేరిన ఐదు రఫెల్ యుద్ధ విమానాలు
ఐదు రఫెల్ యుద్ధ విమానాలు బుధవారం నాడు భారత్ కు చేరాయి.
వివరాల్లోకి వెళితే ప్రపంచంలో అత్యంత అదునాతన యుద్ధ విమానలుగా ప్రసిద్ధికెక్కిన రఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. భారత్ ఫ్రాన్స్ మద్య 36యుద్ధ విమానాలు కొనుగోలుకు సంబంధించి ఒప్పందం జరిగింది తొలుత 2020లో 10యుద్ధ విమానాలు 2021చివరి నాటికి 36యుద్ధ విమానాలు అందించే విధంగా అందులో 16యుద్ధ విమానాలు భారత్ లో తయారు చేసి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విధంగా ఒప్పందం కుదిరింది.
అందులో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరంగా ఐదు యుద్ధ విమానాలు సోమవారం నాడు ఫ్రాన్స్ నుండి బయలుదేరి నేడు బుధవారంనాడు హర్యానా రాష్ట్రం అంబలలోని భారత వైమానిక స్ధావరంకు చేరాయి.
గేమ్ ఛేంజేర్ గా పిలవబడే రఫెల్ యుద్ధ విమానాలు భారత్ అమ్ములపొదుల చేరడం భారత్ కు అదనపు బలం చేకూరినట్లు అయింది.