పట్టణంలో రికార్డు స్థాయిలో నేడు 32కేసులు… 2మరణాలు
పట్టణంలో నేడు రికార్డు స్థాయిలో 32కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ లో నేడు 32కోవిడ్ కేసులు….. 2కోవిడ్ మరణాలు….. మొత్తం కలుపుకుని ఇప్పటి వరకు పట్టణంలో 282కోవిడ్ కేసులు….. 12మరణాలు నమోదయ్యాయి.
ప్రజలకు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు…. అత్యవసర సమయాలలో బయటికి వచ్చినా మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయమని అధికారులు ఎంత చెప్తున్నా ప్రజలలో మార్పు రావడం లేదు….. పట్టణంలో లాక్ డౌన్ విధించి రెడ్ జోన్ లను ఏర్పాటు చేసినప్పటికీ కోవిడ్ కేసులు రోజురోజుకు పెరగడమే కాకుండా నేడు పట్టణంలో ఇప్పటి వరకు లేని విధంగా ఒక్కరోజులో 32కోవిడ్ కేసులు 2కోవిడ్ మరణాలు నమోదయ్యాయి అనే విషయం ప్రజలు ఒక్కసారి ఎవరిని వారు ప్రశ్నించుకోవాల్సిన సమయమే.