సోమ మంగళవారల్లో సంజీవని బస్సులో కోవిడ్ పరీక్షలు
సోమ మంగళవారల్లో సంచార సంజీవని బస్సు నందు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు, డాక్టర్ రాధాకృష్ణ పొదిలి టైమ్స్ కు తెలిపారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా ఉండడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు మేరకు పొదిలి పట్టణంలోని విశ్వనాథపురం జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం మరియు మంగళవారం గర్భవతులకు కరోనా లక్షణాలు ( జ్వరం, జలుబు, ఆయాసం, మొదలుగునవి ) ఉన్నవారికి మరియు పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని……
కావున పరీక్షలు చేయికోవాలి అనుకునే వారు వారి యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి కోవిడ్ పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు.