డేంజర్ బెల్ మోగిస్తున్న పొదిలి పట్టణం
పొదిలి పట్టణంలో డేంజర్ బెల్ మోగుతోంది…..
కోవిడ్ కేసులు రోజురోజుకూ రికార్డులను దాటిపోతూ డేంజర్ జోన్ లో ఉన్నామనే ఆలోచన కలిగిస్తుంది.
నేడు కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ లో అత్యధికంగా 47కోవిడ్ కేసులు నమోదయ్యాయి…. మొత్తం నేటివరకు కోవిడ్ కేసులు 420కి చేరుకున్నాయి.
రెవిన్యూ, పోలీసు, ఆరోగ్య, పంచాయతీ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పట్టణంలో కోవిడ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేస్తుంటే….. ప్రజలు మాత్రం కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా నిర్లక్ష్యం చేసి వారు వైరస్ బారిన పడడమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా కరోనా వైరస్ బారిన పడేందుకు ప్రత్యక్షంగా కారణమవుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికే పొదిలి పట్టణం డేంజర్ జోన్ కు వెళ్ళిపోయింది….. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తమై కనీస జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు సూచనలు పాటిస్తూ….. ఇళ్ల నుండి బయటికి రాకుండా ఉండడం వలన కొంతవరకు వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.