ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో సంచలనం సృష్టించిన కురిచేడు శానిటైజర్ మృతుల ఘటనా కేసును చేధించిన పోలీసులుకు గుంటూరు ఐజీ రివార్డులను అందజేశారు. వివరాల్లోకి వెళితే కురిచేడు ఘటనలో ఫేక్ కంపెనీల పేర్లతో బెల్డ్ షాపులో అమ్మే విధంగా శానిటైజర్లు అమ్మకాలు జరిపి మృతుల కారణమైన వారిని గుర్తించి వారిని అరెస్టు చెయ్యడంలో ప్రతిభ కనబరిచిన పొదిలి సిఐ శ్రీరాం, కానిస్టేబుల్ షేక్ షేక్షావలి లకు గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చేతులు మీదుగా ఒంగోలు యస్పీ కార్యాలయం లో రివార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పీ సిద్దార్థ కౌషిల్ జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు