మర్రిపూడి అదనపు తహశీల్దారుగా రవిశంకర్

మర్రిపూడి మండల రెవెన్యూ అదనపు తహశీల్దారుగా ఆకుల రవిశంకర్ బాధ్యతలు స్వీకరించారు.

వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండల తహశీల్దార్ బదిలీపై వెళ్లడంతో ఉప తహశీల్దారుగా పనిచేస్తున్న ఆకుల రవిశంకర్ కు తహశీల్దారుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా రెవెన్యూ అధికారి ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారంనాడు బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం పంచాయతీ కార్యదర్శి పెట్టెల శంకర్ తదితరులు సత్కరించారు.