నిరాడంబరంగా మాజీ మంత్రి కాటూరి వర్థంతి వేడుకలు
మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ కాటూరి నారాయణ స్వామి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వివరాల్లోకి వెళితే మాజీ మంత్రి కాటూరి నారాయణ స్వామి 10వర్ధంతి పురస్కరించుకుని శనివారంనాడు స్ధానిక చిన్న బస్టాండ్ వద్ద గల కాటూరి నారాయణ స్వామి విగ్రహానికి మరియు కాటూరివారి పాలెంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం స్ధానిక గ్రామ పంచాయతీ కార్యాలయం లో పంచాయతీ సిబ్బందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాటూరి నారాయణ స్వామి కుమారులు వెంకట నారాయణ బాబు, నారాయణ ప్రతాప్,యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సయ్యద్ ఇమాంసా,షేక్ రసూల్,యస్ఎం భాష, జ్యోతి నాగ మల్లేశ్వరరావు, షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.