ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు పొదిలి మండలంలో వైఎస్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
స్ధానిక మార్కాపురం అడ్డరోడ్డు వద్ద విశ్రాంత ఉపాధ్యాయురాలు మరియు వైసీపీ నాయకురాలు ఉడుముల వరమ్మ అధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు…… అనంతరం 300మందికి అన్నదానం చేశారు.
మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద బస్టాండ్, చిన్నబస్టాండ్, విశ్వనాధపురంలలోని వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రపుశాల కోటేశ్వరి, జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, కంభాలపాడు మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, కలశం అంజిరెడ్డి,
దేవిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ జడ్పిటిసి మెట్టు వెంకటరెడ్డి, మాజీ ఎంపిపి నరసింహారావు, వైసీపీ పొదిలి మండల యువజన విభాగం అధ్యక్షులు ఫిరోజ్,
పట్టణ అధ్యక్షులు రబ్బానీ, మాజీ కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలి, నాసర్ రెడ్డి,రత్నం,కె కుమారి, బి రూపిక, మరియు విగ్రహ దాతలు తదితరులు పాల్గొన్నారు.