పార్టీ ఆదేశిస్తే జిల్లా అధ్యక్ష పదవి స్వీకరిస్తా : కందుల
పొదిలి భూ ఆక్రమణలో వైకాపా వాటా ఎంతో చెప్పాలంటూ డిమాండ్
పార్టీ అధిష్టానం అవకాశమిస్తే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు యస్ఎం భాషా నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి ఒంగోలు పార్లమెంటరీ నియోకవర్గం అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని కందుల నారాయణరెడ్డి అన్నారు.
పొదిలి మండలంలో వైకాపా అరాచక పాలన కొనసాగుతోందని ఆక్రమ ఇసుక రీచ్ లను స్వాధీనం చేసుకున్న తరువాత కూడా ఇసుకను ఎదేచ్చగా అక్రమ రవాణా చేశారని……. అదేవిధంగా భూమి చదును పేరుతో కోట్లాది రూపాయల కొల్లగొట్టిన వాటిపై కూడా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని….. ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడని…. అదే విధంగా పొదిలి మండలంలో ఇటివల జరిగిన ఆక్రమణలలో వైకాపా నాయకులు వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.
పొదిలి మండల పరిధిలో జరిగిన ఆక్రమణలలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని……. ఆక్రమణకు పాల్పడ్డ ఆ నాయకుడికి తెలుగు దేశంపార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ నాయకుడు వెనుక ఉన్న వైకాపా నాయకులే వాటాలేసుకుని మరి ఆక్రమణలకు తెరలేపి కోట్లాది విలువైన భూములను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు.
నియోజకవర్గంలో వైకాపా అరాచక పాలన కొనసాగుతుందని వైకాపా అరాచకాలపై త్వరలో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.
కొనకనమిట్ల మండలం చినారికట్ల గ్రామంలో 2000వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో 1500ఎకరాల భూమిని వైకాపా చెందిన వారు 500ఎకరాలు తెదేపా వారు సాగు చేసుకుంటున్నారని కాని గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ వారు సాగు చేసుకుంటున్న భూములను ఖాళీ చేయాలని వైకాపా నాయకులు హెచ్చరిస్తూ భయభ్రాంతులకు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పొదిలి మండల మరియు పట్టణ పరిధిలోని గ్రామ , వార్డు కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి మండల పట్టణ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సామంతపూడి నాగేశ్వరరావు, సయ్యద్ ఇమాంసా, షేక్ రసూల్, ముల్లా ఖుద్దుస్ , భూమా సుబ్బయ్య, మేడా ప్రతాప్, యస్ఎం భాష, తదితరులు పాల్గొన్నారు.