భూ కబ్జా దారులపై కఠన చర్యలు తీసుకోవాలి – సిపిఐ కార్యదర్శి కె.వెంకటరత్నం
పొదిలిలో ప్రభుత్వ భూములు, చెరువులు ,వాగులు, వంకలు ఇస్టానుసారంగా ఆక్రమణలకు తెగబడుతున్నా ఆక్రమణదారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని…… అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ పొదిలి పట్టణ కార్యదర్శి కె వెంకటరత్నం డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకులు అండదండలతో పొదిలిలో ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, అలుగు పోరంబోకు స్దలాలు ఆక్రమణలకు గురయ్యాయని……
ప్రస్తుత భూ ఆక్రమణల వలన వర్షాభావ పరిస్థితుల్లో నీరు పారేందుకు దారిలేక సివారు ప్రాంతాలలో నివసించే పేదల గుడిసెల్లోకి చేరడం వలన ఇటు నివసించేందుకు వీలులేక అటు అనారోగ్యాల బారినపడే అవకాశం ఉందని……. ఇప్పటికే పొదిలిలోని భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అధికారులు స్పందిచి ఆక్రమణదారులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రజలకు అండగా సిపిఐ పార్టీ ప్రజలతో కలసి ధర్నా చేయడానికి సిద్దంగా ఉందని తెలిపారు.