పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 480,482 వాగుల నందు ఆక్రమ నిర్మాణల పై వచ్చిన కధనాలు పై స్పందించిన రెవెన్యూ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు బుధవారం నాడు సంబంధించిన ఆక్రమ నిర్మాణాలను పరిశీలించి వాటిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు మండల రెవెన్యూ తహశీల్దార్ రవీంద్ర రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మ నాయుడు, ఆర్ఐ శివరాం ,మండల సర్వేయర్ బ్రహ్మం, విఆర్ఓ అనిల్ తదితరులు పాల్గొన్నారు