పట్టణంలోని భూ ఆక్రమణలపై న్యాయ పోరాటం చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయం

పట్టణంలోని భూ ఆక్రమణలపై న్యాయ పోరాటం చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.

వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్ధానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా అధ్యక్షతనతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పట్టణంలో ఆక్రమణలపై ప్రజా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చెయ్యాలని అదే విధంగా న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్ష అభ్యర్థి మరియు వైకాపా నాయకులు వాకా వెంకటరెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, బిజెపి నాయకులు చెరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాకినేని అమర్ సింహా, జయసింహ, సిపిఐ పట్టణ కార్యదర్శి కెవి రత్నం, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, లోక్ జనశక్తి నాయకులు ప్రవీణ్, కాంగ్రెసు పార్టీ నాయకులు షేక్ నసిర్ధున్, లింకన్, దర్నాసి సుబ్బారావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎండీ షా, మహ్మద్, సత్తార్, తదితరులు పాల్గొన్నారు