సురక్షితంగా బంధువుల వద్దకు చేరిన బాలుడు
కంభం పట్టణంలో తప్పిపోయిన బాలుడు సురక్షితంగా బంధువుల వద్దకు చేరాడు.
వివరాల్లోకి వెళితే పొదిలి మండలం మల్లవరం గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల బాలుడు హేమంత్ ఆదివారం నాడు తన తాతతో కలిసి కంభం మండలం జంగంగుంట్ల వెళ్ళగా…..
తన బంధువుతో కలిసి కంభం పట్టణానికి వచ్చి తప్పిపోయి కందులాపురం బస్టాండ్ సెంటర్ నందు ఏడుస్తూ తిరుగుతున్న హేమంత్ ను స్థానికులు గమనించి కంభం ఎస్ఐ మాధవరావుకు సమాచారం అందించగా ఎస్ఐ మాధవరావు బస్టాండ్ వద్దకు చేరుకుని బాలుడిని పోలీసు స్టేషనుకు తీసుకువెళ్ళి వివరాలు ఆరాతీసి వివరాలు తెలుసుకుని బాలుడు బంధువులకు సురక్షితంగా చేర్చారు.