మంచినీటికై రోడ్డెక్కిన కాటూరివారి పాలెం గ్రామస్థులు
నీటి సమస్యపై కాటూరివారి పాలెం గ్రామస్థులు ఒంగోలు కర్నూలు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
గత వారం రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమ సమస్యను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో ఒంగోలు కర్నూలు రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు, పోలీసులు హుటాహుటిన చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమంచారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి బ్రహ్మనాయుడు, పొదిలి ఎస్ఐ సురేష్ పోలీసు సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.