శాసనసభ్యులు కుందూరు ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన
పట్టణంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అధ్యక్షతన నిర్వహిచిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభించింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రహదారులు మరియు భవనముల శాఖ అతిథి గృహంలో మార్కాపురం నియోజవర్గం శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అధ్యక్షతన ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు వేగవతం కానున్నాయని అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయని అన్నారు…..
పొదిలి పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నీటి సమస్య పరిష్కారానికి పెద్దచెరువు సమ్మర్ స్టోరేజ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని…… దసరా నాటికి పెద్దచెరువు సమ్మర్ స్టోరేజ్ పనుల ప్రక్రియ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు.
నియోజకవ్గంలో మెడికల్ కాలేజీ మరియు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు అనుమతులు మంజూరు చేశారని త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని….. తద్వారా వైద్యవిద్య మరియు మెరుగైన వైద్యసేవలు అత్యంత చేరువ కానుండడం ఒక శుభపరిణామమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, జి శ్రీనివాస్, కల్లం వెంకట సుబ్బారెడ్డి , గొలమారి చెన్నారెడ్డి, షేక్ జిలానీ, షేక్ రబ్బానీ, మహిళా నాయకురాలు షేక్ నూర్జహాన్, షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు