ఉపాధిహామీ క్షేత్ర సహాయకుని కుటుంబానికి ఆర్ధిక సహాయం

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పొదిలి మండలం ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ క్షేత్ర సహాయకులు సింగంశెట్టి ఎరుకలయ్య సెప్టెంబర్ 20వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించగా…… అతని భార్య నాగ శరత్ చంద్రికకు 60వేల రూపాయల నగదును మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ మరియు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ సిబ్బంది అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆముదాలపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారి మస్తాన్ వలి, ఏపీవో బుల్లెనరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.