పొదిలి మండల నూతన తహశీల్దారు ఎ వి హనుమంతరావు సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి మండలంకు పూర్తి స్థాయి తహశీల్దారుగా దోర్నాల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతరావును గత గురువారంనాడు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా సోమవారం నాడు పొదిలి అదనపు తహశీల్దారు గా పనిచేస్తున్న రవిశంకర్ నూతన తహశీల్దారు హనుమంతరావుకు బాధ్యతలు అప్పగించారు.
నూతన తహశీల్దారు హనుమంతరావుకు సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు