ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా జూపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా జూపల్లి ఏడుకొండలను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే పొదిలి మండలం పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామం చెందిన జూపల్లి ఏడుకొండలుకు డైరెక్టర్ పదవి వరించింది.
జూపల్లి ఏడుకొండలు పంచాయతీ పాలకవర్గ సభ్యులుగా అమ్మా ఎంపిటిసి సభ్యులుగా పనిచేశారు అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏర్పాటు నాటి నుండి పార్టీ లో కీలక పని చేస్తున్నారు. జూపల్లి ఏడుకొండలు కు పదవి లభించాటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.