సీనియర్ ముస్లిం మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఖయ్యుం కన్నుమూత

పట్టణంలోని సీనియర్ మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఖయ్యుం సోమవారంనాడు రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు.

వివరాల్లోకి వెళితే పట్టణంలో సీనియర్ ముస్లిం మైనారిటీ నాయకులుగా ఉన్న మొహమ్మద్ ఖయ్యూం లాల్ ఫౌండేషన్ వ్యవస్థాకులుగా తన కుటుంబ సభ్యులుతో పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

8మంది కుమారులు, నలుగురు కుమార్తెలు కలిగిన మహమ్మద్ ఖయ్యుం కుమారులలో ఒకరు నేషనల్ హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు…… మరో కుమారుడు పట్టణంలో కాలేజీలు నిర్వహిస్తూ లాల్ ఫౌండేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా……. మిగిలినవారు దేశ విదేశాల్లో పలు హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు.

విషయం తెలుసుకున్న మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు పలు పార్టీల నాయకులు, ప్రముఖులు ఖయ్యుం పార్థివదేహాన్ని నివాళులర్పించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.