వస్త్ర దుకాణంలో చోరీ
పట్టణంలోని వినాయక బాబు వస్త్ర దుకాణంలో చోరీ జరిగిన సంఘటన శుక్రవారంనాడు ఉదయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు పెద్దబస్టాండు ఓబులశెట్టి వారి వీధిలోని వినాయక బాబు వస్త్ర దుకాణం తాళాలు పగులగొట్టి ఉండడంతో స్థానికులు వస్త్ర దుకాణం యజమానికి తెలపడంతో యజమాని వచ్చి షాపును తెరచిచూసి విలువైన పట్టుచీరలు చోరికి గురయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంకు సమాచారం అందించి వేలిముద్రలను సేకరించారు.
షాపు యజమాని వినయకబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.