భూ కబ్జాలపై నిజాలను బయటపెట్టాలని తహశీల్దారుకు వినతి

పొదిలి మండల రెవిన్యూ తహశీల్దారుగా నూతనంగా నియమితులైన సందర్భంగా తహశీల్దార్ ఏవి హనుమంతరావును కలిసిన రాజకీయపక్ష నేతలు శాలువాలు, పూలమాలలతో సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని సుమారు 125కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని…. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా యదేచ్ఛగా వ్యాపార సముదాయాలు, వెంచర్లు, ఇళ్లు నిర్మించుకుని పొదిలిలోని వాగులు, వంకలు, అలుగులు, చెరువులు, స్మశానాలు, అనే తేడా లేకుండా ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే ఎక్కడికి అక్కడ నిర్మాణాలు చేపడుతున్న భూ బకాసురులపై పిడి యాక్టు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తహశీల్దారు హనుమంతరావును కోరారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ సైదా, సిపిఎం పొదిలి ఏరియా కార్యదర్శి కె రమేష్, సిపిఐ పొదిలి పట్టణ కార్యదర్శి కెవి రత్నం బిజెపి నాయకులు మాకినేని అమర సింహ, లోక్ జనశక్తి జిల్లా అధ్యక్షులు, కొండ ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు కొట్టు వరప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.