వాలంటీర్లు సేవాభావంతో పనిచేయాలి: ఐఏఎస్ అధికారి ఆరీజ్ ఆహ్మమద్
గ్రామ వాలంటీర్లు సేవాభావంతో పనిచేయాలిని అస్సాం క్యాడర్ ఐఏఎస్ అధికారి ఆరీజ్ ఆహ్మమద్ అన్నారు.
వివరాల్లోకి పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ వాలంటీర్లు తో మంగళవారం నాడు స్థానిక పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఎంపిడిఓ శ్రీ కృష్ణ అధ్యక్షతనతో జరిగిన సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన అస్సాం క్యాడర్ ఐఏఎస్ అధికారి ఆరీజ్ ఆహ్మమద్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాగా ఉండి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సకాలంలో తీసుకుని వెళ్ళేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మ నాయుడు, మరియు గ్రామ సచివాలయల సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు