పొదిలి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై అవగాహన ర్యాలీ, మరియు మానవహారం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక చిన్న బస్టాండ్ నుంచి పెద్ద బస్టాండ్ వరకు కరోనా వ్యాధి నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేతులుకడుకుందాం క్షేమంగా ఉందాం.!కరోనా అంతం అదే మన పంతం మాస్కులు ధరించండి కరోనాను నివారించండి అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు ఎ వి హనుమంతరావు, ప్రభుత్వ వైద్య అధికారిణి షాహిదా, పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మ నాయుడు, మరియు వివిధ శాఖల తదితరులు పాల్గొన్నారు