లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం
లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం
లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం శుక్రవారంనాడు ప్రారంభమైంది.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని స్థానిక చిన్న బస్టాండు మసీదు వద్ద మొహమ్మద్ లాల్ అహమ్మద్ మరియు వారి కుమారులు మొహమ్మద్ ఖయ్యుం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం శుక్రవారంనాడు లాల్ ఫౌండేషన్ సభ్యులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా లాల్ ఫౌండేషన్ నిర్వాహకులు మొహమ్మద్ ఆఖిబ్ అహమ్మద్ మాట్లాడుతూ లాక్ డౌన్ ముగిసినప్పటికీ కరోనా వ్యాప్తి ఉండడంతో పేద ప్రజలు తినడానికి తిండి లేక పడుతున్న కష్టాలను చూసి మా వంతు సహాయంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 11గంటల నుండి 1గంట వరకు పేదలకు అన్నదానం చేయాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు (లాల్ ఫౌండేషన్) నిర్వాహకులు మొహమ్మద్ ఆరిజ్ అహమ్మద్(ఐఎఎస్), మొహమ్మద్ ఆఖిబ్ అహమ్మద్, హజీర్ అలి మరియు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.