ఘనంగా ఎఐటియుసి శతజయంతి వేడుకలు
అఖిల్ భారత కార్మిక యూనియన్ కాంగ్రెస్ శాతం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే ఏ ఐ టి యు సి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు స్థానిక పొదిలి ఆర్టీసీ డిపో నందు ఏ ఐ టి యు సి జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిపిఐ మండల పార్టీ కార్యదర్శి కె వెంకటరత్నం మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాద విముక్తి కోసం యావత్ భారతావని జాతీయ ఉద్యమ బాటలో నడుస్తున్న తరుణంలో ఐరోపా దేశా లోప్రజాస్వామిక ఉద్యమాలు రష్యాలో 1917 కమ్యూనిస్టు ఉద్యమం భారత్ లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం పారిశ్రామిక కేంద్రాల్లో వరుసగా జరిగిన కార్మిక నిరసనలు సమ్మె లు తదితర అంశాల ఫలితంగా కార్మికులు ఆర్థిక సాంఘిక రాజకీయ ప్రయోజనాల స్థాపనే ఆశయంగా 1920 అక్టోబర్ 31 బొంబాయి కేంద్రంగా ఏఐటియుసి ఆవిర్భవించింది తొలి అధ్యక్ష కార్యదర్శులుగా లాలాలజపతిరాయ్ దివాన్ చమన్ లా నేతృత్వంలో పండిట్ నెహ్రూ నేతాజీ వి.వి.గిరి సరోజిని నాయుడు తదితర జాతీయ ఉద్యమకారుల సహకారంతో స్థాపించిన ఏఐటియుసి వస్తు ఉత్పత్తి జాతీయం చేయడం మెరుగైన ఆర్థిక సామాజిక పరిస్థితులు కల్పించడం సంఘం ఏర్పాటుకు సంపూర్ణ స్వేచ్ఛ కుల మత జాతి వివక్ష ను రద్దు చేయడం తదితర అంశాల సాధనే లక్ష్యం తో పాటు జాతీయ ఉద్యమంలో కార్మికుల పాల్గొనేలా విశేష కృషి చేసిన ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అని భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన పిదప కార్మికులకు రాజ్యాంగపరమైన హక్కులను సాధించుటలో కార్మిక చట్టాలు ఏర్పాటులో గణనీయమైన పాత్ర పోషించింది కాలక్రమంలో దేశంలో ఏర్పడిన రాజకీయ పరిణామం లో భాగంగా పెట్టుబడిదారీ వర్గం తో పాలకవర్గాలు లాలూచీపడి ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రక్రియను నిలుపుదల కోరుతూ చట్టసభల పేరుతో కార్మిక చట్టా లను తూట్లు పొడుస్తూ కార్మిక వర్గ ప్రయోజనాల ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర పాలక వర్గాలకు ఎదిరిస్తూ దేశంలో అనేక ఉద్యమాలు నిర్వహించిన ఏకైక యూనియన్ ఏ ఐ టి యు సి దేశవ్యాప్తంగా 14.2 మిలియన్ సభ్యత్వం కలిగి అంతర్జాతీయ డబ్ల్యూ ఎఫ్ టి యు లో సభ్యత్వం పొంది కార్మిక వర్గ ప్రయోజనమే ప్రధానంగా ముందుకు దూసుకు వెళ్తున్న ఏకైక యూనియన్ ఏ ఐ టి యు సి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా రైతు యువజన విద్యార్థి ఉద్యోగ వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఉద్యమిస్తున్న సంస్థ ఎఐటియుసి అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెంకట్రావు కొండలు ఎస్ కె షరీఫ ఆటో యూనియన్ నాయకులు షేక్ జిలాని టైలర్స్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు స్టూడియో యూనియన్ నాయకులు బాబు కిషోర్ తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు