నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సిఐ శ్రీరాం

               లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమంలో సిఐ శ్రీరాం పాల్గొన్నారు

వివరాల్లోకి వెళితే పట్టణంలోని స్థానిక చిన్న బస్టాండు మసీదు వద్ద మొహమ్మద్ లాల్ అహమ్మద్ మరియు వారి కుమారులు మొహమ్మద్ ఖయ్యుం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమంలో శనివారంనాడు సిఐ శ్రీరాం పాల్గొన్ని లాల్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందిస్తూ లాక్ డౌన్ ముగిసినప్పటికీ కరోనా వ్యాప్తి ఉండడంతో పేద ప్రజలు తినడానికి తిండి లేక పడుతున్న కష్టాలను చూసి తమ వంతు పేదలకు అన్నదానం చేయాలనే తలంపు చాలా శుభపరిణామాని అన్నారు.

ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ చైర్మన్ మొహమ్మద్ ఆఖిబ్ అహమ్మద్, ముల్లా జిలానీ మరియు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.