రేపు ఎంబిసి రాష్ట్ర అధ్యక్షులు పర్యటన

అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం ( ఎంబిసి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఆకుమళ్ళ నాని రేపు పొదిలి పట్టణంలో పర్యటిస్తున్నట్లు జిల్లా నాయకులు చెట్లూరి బాదుల్లా ఒక ప్రకటన లో తెలిపారు.

పొదిలి పట్టణంలోని విశ్వనాథపురం స్థానిక బి యల్ యన్ గ్రాండ్ నందు సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా ఎంబిసి సంక్షేమ సంఘం సమీక్ష సమావేశం అనంతరం జిల్లా నూతన కమిటీ ఏర్పాటు జరుగుతుందని కావున ఎంబిసి కుల సంఘాల నాయకులు పాల్గొన్ని జయప్రదం జిల్లా నాయకులు చెట్లూరి బాదుల్లా ఒక ప్రకటనలో కోరారు.