ఎంబిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా బాదుల్లా నియామకం

అత్యంత వెనుకబడిన తరగతుల (ఎం బి సి) సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గా చెట్లూరి బాదుల్లాను నియామిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఆకుమళ్ళ నాని నియామక పత్రం అందజేశారు.వివరాల్లోకి వెళితే ప్రకాశంజిల్లా ఎంబీసి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బాదుల్లాను నియమించిన సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఎంబిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆకుమళ్ల నాని ముఖ్యఅతిథిగా హాజరై నియామక పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ
ఎంబిసి సంక్షేమ సంఘం కమిటీలను నియమించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన శక్తిగా మలిచి రాజ్యాధికారంలో వాటా కోసం ఉద్యమం నిర్మించి……. అత్యంత వెనుకబడిన కులాల రాజ్యాధికారం కోసం పాటుపటుపడతానని అన్నారు.