రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరాహారదీక్ష
కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన మూడు రైతు చట్టాలను నిరసిస్తూ వామపక్షాలు ఆధ్వర్యంలో నిరాహారదీక్ష నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు రైతులతో కలిసి నిరాహారదీక్ష నిర్వహించాలనే వామపక్షాల పిలుపు మేరకు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.