తిరుపతిరావును పరామర్శించిన కుందూరు
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి వైసీపీ యువనాయకుడు తిరుపతిరావును పరామర్శించారు.
వివరాల్లోకి వెళితే సెప్టెంబరు 2వతేదీ వైయస్సార్ వర్ధంతి రోజున మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యువజన నాయకులు కామునూరి తిరుపతిరావు ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడగా……. ఇంటి నివేశన స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారంనాడు గ్రామానికి వచ్చిన సందర్భంగా తిరుపతిరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు
ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఏదైనా అవసరం ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే సహాయం చేస్తానని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కుందూరు నాగార్జునరెడ్డి వెంట వైకాపా నాయకులు జి శ్రీనివాస్, కల్లం వెంకట సుబ్బారెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.