ఐక్యతతో చౌక ధరల దుకాణాల డీలర్లు హక్కులను సాధించాలి:

రాష్ట్ర అధ్యక్షులు దివి లీలామాధవరావు

ఐక్యతతో చౌక ధరల దుకాణాల డీలర్లు తమ హక్కులను సాధించుకోవాలని చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివి లీలామాధవరావు అన్నారు.

వివరాల్లోకి వెళితే గురువారంనాడు స్ధానిక విశ్వనాథపురంలోని ప్రెవేటు కళ్యాణ మండపం నందు జిల్లా అధ్యక్షులు కాట ఆంజనేయులు అధ్యక్షతనతో జరిగిన అత్యవసర సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు దివి లీలామాధవరావు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితుల్లో ఐక్యంగా ఉద్యమించాలని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకుని ముందుకు వెళ్లేందుకు సాగుదామని దానితోపాటు ఆర్థిక తోపాటు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.