అనుమానాస్పద మృతి కేసు నమోదు

అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం పై కేసు నమోదు చేసినట్లు యస్ ఐ సురేష్ ఒక ప్రకటన లో తెలిపారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని బాప్టిస్ట్ పాలెం నందు గురువారం సాయంత్రం ఎనిబర్ల చంటి (22) తన అత్త గారి ఇంటి వద్ద స్రృహ కోల్పోయి ఉండగా అత్తమామలు వైద్యసేవలు కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాల తరలించి పరీక్ష చేయగా అప్పడికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని దానితో మృతుని సోదరి గాలిముట్టు ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు యస్ఐ సురేష్ ఒక ప్రకటన తెలిపారు