ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ క్యాలెండర్ ఆవిష్కరించిన యస్ఐ సురేష్

ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ క్యాలెండర్ ను పొదిలి యస్ఐ సురేష్ ఆవిష్కరించారు.

వివరాల్లోకి వెళితే ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ నాయకులు కనకం వెంకట్రావు యాదవ్ నాయకత్వంలో శనివారంనాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు యస్ఐ సురేష్ చేతుల మీదుగా 2021 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, మువ్వా కాటంరాజు, ఇర్లపాటి సుబ్బారావు, యక్కలి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.