పట్టాలు పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి బాలినేని చేతుల మీదుగా ఇంటి నివేశన పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు విద్యుత్తు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా సోమవారంనాడు ఉదయం 11గంటలకు ఇంటి నివేశన పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మండల రెవన్యూ తహశీల్దారు హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులు హాజరవుతారని ఆయన తెలిపారు