ఊరొచ్చేస్తోంది షార్ట్ ఫిల్మ్ తొలి షాట్ కు దర్శకత్వం వహించిన సిఐ శ్రీరామ్
ఊరొచ్చేస్తోంది లఘుచిత్రం తొలి షాట్ కు పొదిలి సిఐ దర్మకత్వం వహించి లాంఛనంగా ప్రారంభించారు.
ఉన్నవారిని కన్నవారిని వదిలి పల్లె నుంచి పట్నం బాట పట్టిన ఇద్దరు రైతులు కరోనా కష్టకాలంలో ఎదుర్కున్న దీనావస్థను కళ్ళకు కట్టినట్లు చూపించే చిరు ప్రయత్నం “ఊరు వచ్చేస్తుంది” అనే సామాజిక ప్రేరణతో కూడిన కథనంతో షార్ట్ ఫిలిం షూటింగ్ పొదిలి టు కర్నూల్ జాతీయ రహదారిపై శని ఆదివారల్లో సీనియర్ జర్నలిస్టు కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ స్వియదర్శకత్వంలో తెరకెక్కుతున్న లఘుచిత్రంలోని ప్రధాన పాత్రలలో కరణం శ్యామ్ శరణ్ , నాగశ్రీ, శ్రీనివాస్, స్థానిక సీనియర్ రిపోర్టర్ జేకే విశ్వనాథ్ కీలకమైన పాత్రలు పోషించే లఘు చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సుమంత్ వ్యవహరించనున్న ఈ లఘు చిత్రానికి పొదిలి సిఐ శ్రీరామ్ కొబ్బరికాయ కొట్టి తొలి షాట్ కు దర్శకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.