బంగారం పేరుతో ఘరాన మోసం……..ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు…….. 3లక్షల50వేలు స్వాధీనం
లంకెబిందెల్లో బంగారం దొరికిందని తక్కువ ధరకు ఇస్తామని ఘరానా మోసానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం పొన్నూరు గ్రామానికి చెందిన కిన్నెర శ్యాం కుమారుడికి 40రోజులక్రితం పొదిలి రథంరోడ్డు నందు కొంత మంది వ్యక్తులు తమకు పునాదులు తవ్వుతుండగా రెండు లంకెబిందెలు దొరికాయని ఒక దానిలో బంగారం ఒక దానిలో వెండి ఉందని బంగారం అతి తక్కువ ధరకు(8లక్షలకే) ఇస్తామని కర్నాటక రాష్ట్రం బళ్లారి రావాలని సెల్ నెంబర్ ఇచ్చి వెళ్లగా గత 2018 డిసెంబర్ 7వ తేదిన బయలుదేరి 8వతేది బళ్లారి చేరుకుని వారికి ఇచ్చిన సెల్ నంబరుకు ఫోన్ చేసి కలిసిన అనంతరం వెళ్లిన వారి వద్ద నుండి 3లక్షల50వేలు తీసుకుని పోలీసులు వస్తున్నారని చెప్పి వెళ్లిన వారి వద్ద ఉన్న నగదును గబగబా తీసుకుని నకిలీ బంగారం ముక్కలు ఇచ్చి పరారయ్యారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పొదిలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందుకున్న పొదిలి యస్ఐ శ్రీరాం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గురువారం స్ధానిక ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల వద్ద సంచరిస్తున్నారనే సమాచారంతో వీరేష్, కావేటి వెంకటేష్, అనే ఇద్దరిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారయ్యాడని దరిశి ఇంచార్జి డియస్పీ చీరాల డియస్పీ పి.విశ్రీనివాసరావు పొదిలి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కేసులో ప్రతిభ చూపిన పొదిలి యస్ఐకి జిల్లా యస్పీ సత్య ఏసుబాబు రివార్డు ప్రకటించారని తెలిపారు. ఈ సమావేశంలో పొదిలి యస్ఐ శ్రీరామ్, శిక్షణ యస్ఐ భవాని, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.