లక్ష్మీస్ ఎన్టీఆర్.. మరో అప్డేట్ ఇచ్చిన వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోనే కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబింధువైంది. ఇప్పటికే టీడీపీ వర్గాలు వర్మ సినిమాపై మండిపడుతున్నారు. అయితే వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే రెండు పాటలతో పాటు కీలక పాత్రల దారులను పరిచయం చేసిన వర్మ మరో అప్డేట్ ఇచ్చాడు.
అంతేకాదు వర్మ ప్రకటనలకే పరిమితమయ్యాడా..? నిజంగానే సినిమా తీస్తున్నాడా అన్న అనుమానాలకు కూడా తెర దించాడు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆన్‌లోకేషన్ స్టిల్స్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ నాయకులు అంతా భోజనం చేస్తున్న స్టిల్‌తో పాటు మరో స్టిల్‌ను రిలీజ్ చేశాడు. వర్మ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటునే తనదైన స్టైల్లో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా కానిచ్చేస్తున్నాడు. ఈ నెలాఖరున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.