నాపై కంప్లైంట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు: ఆర్జీవీ
ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘వెన్నుపోటు’ పాటపై తెలుగునాట తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన చిత్రపటాలను తగలబెడుతున్నారు. దీనిపై తనదైన శైలిలో సెటైర్ వేశారు ఆర్జీవీ. ఏపీలో ఓ చోట జరిగిన నిరసనలో కొంతమంది కార్యకర్తలు వర్మ ఫొటోలకు నిప్పంటిస్తూ, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ… ‘‘వాళ్ల ముఖాల్లో కోపం కనపడటం లేదు.. వాళ్లు నవ్వుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా జాయిన్ కావచ్చా.. ప్లీజ్’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే మరో ట్వీట్ చేస్తూ… ‘‘నిరసనలు వ్యక్తం చేస్తూ, ఫొటోలు తగలబెడుతూ, పోలీసు కంప్లైంట్లు ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే పాటకు వ్యూస్ పెంచుతున్నారు. ఒక్క నా ఛానల్ ద్వారానే ఇప్పటివరకు 10 లక్షల మంది చూశారు.. అంతటా కలిపి 15 లక్షల వరకు ఉండొచ్చు’’ అన్నారు.