రంగా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చదరంగం సినిమా షూటింగ్ ప్రారంభం
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక వాసవీ కాంప్లెక్స్ నందు వంగవీటి మోహన రంగా నిజజీవితం అంశం గా రూపొందిస్తున్న చదరంగం చిత్రంకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు.
చదరంగం చిత్రంలో పొదిలి పట్టణం చెందిన రోటీ రబ్బానీ మరి కొంత మంది కొన్ని పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణం చెందిన వైకాపా నాయకులు మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు