కుమారస్వామి ప్రభుత్వంపై 20మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి : యడ్యూరప్ప

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వంపై 20మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యలు అసంతృప్తిగా ఉన్నారని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బియస్ యడ్యూరప్ప అన్నారు.

శుక్రవారం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జనతాదళ్ సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారని ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చునని వేచి చూడాలని అన్నారు.